దాస్ సినిమాపై అమ్మడి ఆశలు..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తనే డైరెక్షన్ లో వస్తున్న సినిమా దాస్ కా ధంకీ( Das Ka Dhamki ).ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్( Vishwak Sen ) డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇదే.

 Niveda Peturaj Hopes Only Dhamki Movie , Niveda Peturaj , Das Ka Dhamki  , Vishw-TeluguStop.com

హీరోగా మాస్ ఇమేజ్ తెచ్చుకునే క్రమంలో ఒక మోస్తారుగా యూత్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్న విశ్వక్ సేన్ తన లేటెస్ట్ సినిమా ధంకీతో బాక్సాఫీస్ పై తన సత్తా చాటాలని చూస్తున్నాడు.సినిమాలో హీరోయిన్ గా నివేదా పేతురాజ్( Niveda Peturaj ) నటించింది.

ఇప్పటివరకు ఆమె తెలుగులో చేసిన సినిమాలన్నిటిలో ఈ సినిమాలోనే గ్లామర్ రోల్ చేసింది.మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా కోసం అమ్మడి అందాల ప్రదర్శన చేసింది.

అయితే నివేదా ఎందుకు ఇలా చేసింది అంటే.అసలే అవకాశాలు లేని టైం లో హీరోయిన్ గా విశ్వక్ సేన్ ఛాన్స్ ఇచ్చాడు.ఈ సినిమాలో హీరోయిన్ ది కొద్దిగా గ్లామర్ రోల్ అని ముందే చెప్పారట.అయితే నివేదా అసలైతే ఈ పాత్ర చేయాలని అనుకోలేదు కానీ ఆల్రెడీ పాగల్ తో విశ్వక్ కు దగ్గరైన నివేదా అతనితో కంఫర్టబుల్ గా ఉంటుందని గ్లామర్ రోల్ కి ఓకే చెప్పిందట.

ప్రస్తుతం తెలుగులో ఆమెకు ఇది చివరి అవకాశమని చెప్పొచ్చు.మరి నివేదాకు ధంకీ ఏమేరకు కెరీర్ కి హెల్ప్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube