మరో వివాదం తో వార్తల్లో నిలిచిన స్వామి నిత్యానంద  

Swami Nityananda Latest Upadate-janardhana Sharma,lomudra Sharma,nanditha,nityananda,swami Nityananda

గతంలో ఆశ్రమం లో శృంగార కలపాలు జరుపుతున్నారు అని ఆరోపణలు ఎదుర్కొని వివాదాల్లో చిక్కుకున్న స్వామి నిత్యానంద ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.ఆయన తన ఆశ్రమంలో నిర్బంధించిన తమ కూతుళ్లను విడిపించాలంటూ ఓ జంట గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.జనార్థన శర్మ అనే దంపతులు తమ నలుగురు కుమార్తెలను 2013లో బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు.అప్పటి నుంచి అక్కడికి వెళ్లి వస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు.

Swami Nityananda Latest Upadate-janardhana Sharma,lomudra Sharma,nanditha,nityananda,swami Nityananda Telugu Viral News Swami Nityananda Latest Upadate-janardhana Sharma Lomudra Nanditha Nityananda Sw-Swami Nityananda Latest Upadate-Janardhana Sharma Lomudra Nanditha Nityananda

ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో శర్మ నలుగురు కూతుళ్లను నిత్యానంద ధాన్యపీఠం నుంచి అహ్మదాబాద్‌లోని యోగిని సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేసినట్లు తెలిసింది.అయితే విషయం తెలుసుకున్న ఆ తల్లి దండ్రులు వారిని కలిసేందుకు వెళ్లగా అక్కడి వారు తమ బిడ్లను చూసుకోనీకుండా అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసుల సహాయంతో శర్మ దంపతులు ఆశ్రమానికి వెళ్లి తమ ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు.అయితే మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ(21), నందిత(18) తల్లిదండ్రులతో వచ్చేందుకు నిరాకరించడం తో వారు హైకోర్టు ను ఆశ్రయించారు.తమ ఇద్దరు కూతుళ్లను ఆశ్రమ నిర్వాహకులు బెదిరించి తమతో రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ వారు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

ఇదే విషయాన్నీ కోర్టు కు కూడా తెలిపి తమ కూతుళ్లు ఇంటికి తిరిగి వచ్చేలా ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని విన్నవించినట్లు తెలుస్తుంది.గతంలోనే నిత్యానంద ప్రముఖ నటితో రాసలీలలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా ఆయన మరో వివాదం లో చిక్కుకొని మరోసారి వార్తల్లో నిలిచారు.