ఆ పాత్రలు చేయడానికి కూడా నిత్య ఓకే చెప్తుందట..

నిత్యా మీనన్. మలయాళీ ముద్దుగుమ్మ.

తెలుగులో చక్కటి నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి అద్భుత పేరు సంపాదించింది.

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.

తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు మరో సౌందర్య పరిచయం అయ్యిందని అందరూ భావించారు.

అనుకున్నట్లుగానే తనకు తెలుగులో మంచి అవకాశాలు లభించాయి.అంతేకాదు.

Advertisement

నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ముందుకు సాగింది.అయితే తనను గ్లామరస్ హీరోయిన్ గా కాకుండా నటిగానే తెలుగు జనాలు ఇష్టపడ్డారు.

మంచి ఆఫర్లు వస్తున్నా.ఈ ముద్దుగుమ్మ తన ఫిట్ నెస్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టలేదు.

అందువల్లే.తనకు చాలా అవకాశాలు మిస్సయ్యాయి.

చాలా కాలంగా తెలుగులో ఆమెకు అవకాశాలు కూడా దూరం అయ్యాయి.చాలా నెలల పాటు ఒక్క సినిమాలోనూ అవకాశాలు దక్కలేదు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?

కొంత కాలం క్రితం గీతా గోవిందం సినిమాలో స్పెషల్ అప్పిరియన్స్ లో కనిపించింది.మళ్లీ చక్కటి నటనతో ఆకట్టుకుంది.

Advertisement

తాజాగా తను తమిళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తుంది.అయితే కొంత కాలంగా తనకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయట.అయితే హీరోయిన్ గా కాకుండా.

కారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు లభిస్తున్నాయట.తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నిత్యను తమ సినిమాల్లో పెట్టుకుంటే.

ప్లస్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

అటు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అటు నిత్య కూడా హీరోయిన్ అవకాశాల కోసం కాకుండా.స్పెషల్ క్యారెక్టర్లు చేసేందుకు ఓకే చెప్తుందట.

నటనకు అవకాశం ఉన్న ఏపాత్ర చేయడానికి అయినా తను ఓకే చెప్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల నుంచి పలు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.

వాటిలో మంచి సినిమాలకు ఓకే చెప్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు