పెద్దన్న పాత్ర కాంగ్రెస్ దే! నితీష్ కు జలక్ ఇస్తున్న హస్తం పెద్దలు??

జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నిటిని ఒక తాటిపైకి తీసుకువచ్చి పోరాడితే తప్ప బిజెపిని( BJP ) గద్దె దించడం కుదరదని భావిస్తున్న కాంగ్రెస్( Congress ) ఆ దిశగా కొన్ని ప్రయత్నాలను చేసింది.అదే రకం ప్రయత్నాలు చేస్తున్న నితీష్ కుమార్ కు( Nitish Kumar ) మద్దతు ఇచ్చింది.

 Nitish Kumar Cornered By Congress Towards Alliance Details, Nitish Kumar, Congre-TeluguStop.com

కాంగ్రెస్ ఇచ్చిన అండతో అనేక పార్టీల అధినేతలను కలిసిన నితీష్ ఆ మేరకు మద్దతు తీసుకురాగలిగారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .( Mamta Banerjee ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వంటి వారు ఈయన ప్రయత్నాలకు కలిసి వచ్చారు.

అయితే క్రమంగా బలపడుతున్న కాంగ్రెస్ ధోరణి ఇప్పుడు మారినట్లుగా తెలుస్తుంది.

Telugu Congress, Karnataka, Mamata Banerjee, Nitish Kumar, Rahul Gandhi, Sonia G

కర్ణాటకలో సింగిల్ గా అధికారం లోకి రావడంతో పాటు భాజపా వ్యతిరేక గాలులు దేశమంతా వీస్తున్నాయని నమ్ముతున్న కాంగ్రెస్ ఇప్పుడు తానే పెద్దన్న పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది.ఈనెల 12వ తేదీన విభక్షాల భేటీ నిర్వహించాలని నితీష్ కుమార్ భావించినా కూడా తమ ముఖ్య నేతైన రాహుల్ గాంధీ కానీ, పార్లమెంటరీ నేత అయిన మల్లికార్జున్ ఖర్గే గాని లేకుండా సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం కాంగ్రెస్కు ఆగ్రహం తెప్పించినట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా తాను నిర్వహించే సమావేశానికి ముఖ్య నేతలు మాత్రమే రావాలన్న కండిషన్ పెట్టిన నితీష్ కుమార్ వైఖరిపై ప్రతిపక్ష నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారట.

Telugu Congress, Karnataka, Mamata Banerjee, Nitish Kumar, Rahul Gandhi, Sonia G

కాంగ్రెస్ లేకుండా కూటమి అన్నది అనవసరమని కాంగ్రెస్తో కలిసి వెళ్తేనే మోడీని ఓడించడం కుదురుతుంది అన్న భావనతో ఉన్న ప్రతిపక్షాలు నితీష్ కాంగ్రెస్కు ప్రాముఖ్యత ఇవ్వకుండా ముందుకు వెళ్ళటాన్ని సమర్ధించడం లేదట.అందుకే సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది.ఇప్పుడు కాంగ్రెస్ కూడా డ్రైవింగ్ సీట్ తమదే ఉండాలని భావిస్తున్నందున నితీశ్ తో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .మరి ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి పడుతున్న విపక్ష కూటమి ఎన్నికల నాటికి ఏమాత్రం బలపడుతుందో, భాజపాకు ఏ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube