కేంద్ర మంత్రి కారుకు చలానా

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వాహన చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెల్సిందే.

ఎంతగా అంటే తమ వాహనాలను బయటకు తీయాలి అంటే ఎక్కడ చలానా పడుతుందో అనే భయం వారిని వెంటాడుతూ ఉంది.

తాజాగా ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారి మాట్లాడుతూ ఇలాంటి కఠిన చట్టాలు, జరిమానాలు లేకుంటే ఎవరు కూడా చట్టంను గౌరవించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.తాజాగా బీజేపీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు.

ఆ సందర్బంగా మాట్లాడుతూ కొత్త వాహన చట్టంను తాను పూర్తిగా సమర్ధిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ప్రజల సేఫ్టీ కోసమే ఈ కొత్త చట్టం అన్నాడు.

ఇక తన కారు కూడా ఓవర్‌ స్పీడ్‌ కారణంగా చలానాను పొందింది.ఆ చలానాను నేను కట్టాను అంటూ గడ్కారి అన్నాడు.

Advertisement

నూతన చట్టం కారణంగా అవినీతి కూడా చాలా వరకు తగ్గుతుందనే నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఉందని గడ్కారి పేర్కొన్నాడు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు