రెండు ప్లాప్‌లు వచ్చినా ఆమెపై నితిన్‌కు అంత ఇది ఏంటో?

ఈమద్య కాలంలో హీరోలు ఒక్క ఫ్లాప్‌ వస్తే మళ్లీ ఆ దర్శకుడితో కాని హీరోయిన్‌తో కాని సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.కాని నితిన్‌ మాత్రం ఒక హీరోయిన్‌ తో ఇప్పటికే రెండు ప్లాప్‌ లు పడ్డాయి.

 Nitin Again Romance With Megha Akash In Check Movie Nithin, Megha Akash, Chal M-TeluguStop.com

అయినా కూడా మూడవ సారి ఆమెతో రొమాన్స్‌కు సిద్దం అయ్యాడు.రెండు డిజాస్టర్ లను ఆమెతో చేసిన నితిన్‌ ఏమాత్రం భయం లేకుండా ఆందోళన లేకుండా బ్యాడ్‌ సెంటిమెంట్‌ గురించి ఆలోచించకుండా ఆమెతో సినిమాను చేసేందుకు సిద్దం అవ్వడం నిజంగా ఆయన ఘట్స్‌ కు హ్యాట్సాఫ్‌ అంటున్నారు.

ఇంతకు నితిన్‌ చేయబోతున్న ఆ హీరోయిన్‌ ఎవరో తెలుసా మేఘా ఆకాష్‌.ఈ అమ్మడితో ఇప్పటికే నితిన్‌ లై మరియు చల్‌ మోహన్‌ రంగ సినిమాలను చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమాలకు సంబంధించిన ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినిమాల ఫలితం విషయం పక్కన పెడితే ఇద్దరి పెయిర్‌ గురించి అప్పుడు టాక్‌ వచ్చింది.

ఇద్దరు ఈడు జోడు బాగున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.మొత్తానికి వీరిద్దరి కాంబోలో రాబోతున్న మరో మూవీ గురించి నెగటివిటీ కంటే పాజిటివ్‌ టాక్‌ ఎక్కువగా వినిపిస్తుంది.

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చెక్‌ సినిమాలో ఇప్పటికే ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా ప్రకటించారు.వారిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

తాజాగా మరో హీరోయిన్‌గా మేఘా ఆకాష్‌ ను ఎంపిక చేయాల్సిందిగా దర్శకుడికి నితిన్‌ సిఫార్సు చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలు కనుక నిజం అయితే నితిన్‌ మరోసారి మేఘా ఆకాష్‌ తో రొమాన్స్‌ చేయడం పక్కా.

మరి ఈసారి అయినా వీరి కాంబోకు సక్సెస్‌ దక్కుతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube