Nithya Menon : కోరిక తీర్చమని నిత్యామీనన్ కి టార్చర్ పెట్టిన కోలీవుడ్ హీరో.. అసలు విషయం చెప్పిన నటి?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లకు మహిళ క్యారెక్టర్ ఆర్టిస్టులకు( women character artists ) సింగర్లకు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి.కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

 Nithya Menon React On Casting Couch Rumours On Her-TeluguStop.com

అయితే అది మన వ్యక్తిత్వం మన ఆలోచనలు బట్టి మనం అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం లేదా ఇబ్బందులకు తలంచి లొంగిపోగలమా అన్నది ఆధారపడి ఉంటుంది.

ఇక ఈ ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి అని ఎంతోమంది ఆరాటపడుతూ ఉంటారు అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కావాలి అంటే తప్పకుండా తమకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోలు కూడా హీరోయిన్లను అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులను హింసిస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అందరూ అలాగే ఉంటారని కాదు కానీ కొందరు మాత్రం హీరోయిన్ల పట్ల ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారని ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting Couch ) ఉందనే విషయాన్ని వెల్లడించారు.

Telugu Amazon Prime, Kollywood, Nithya Menon, Srimathi Kumari-Movie

ఇకపోతే నటి నిత్యా మీనన్ సైతం ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి.మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నిత్యామీనన్( Nithya Menon ) తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.అయితే ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మొదట్లో ఒక కోలీవుడ్ హీరో ( Kollywood Hero ) నిత్య మీనన్ వెంటపడి ఆమె తన కోరిక తీర్చాలి అంటూ తనని ఎంతో ఇబ్బందులకు గురి చేశారంటూ గతంలో ఒక వార్త వైరల్ గా మారింది అయితే ఈ వార్తలు స్వయంగా నిత్యమీనన్ చెప్పినట్లు ప్రచారం అయ్యాయి.

Telugu Amazon Prime, Kollywood, Nithya Menon, Srimathi Kumari-Movie

ఇక తాజాగా నిత్యమీనన్ శ్రీమతి కుమారి ( Srimathi Kumari ) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసింది.ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 28వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో( Amazon Prime Video ) ప్రసారం కాబోతోంది దీంతో ఈమె పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిత్యమీనన్ సమావేశంలో మాట్లాడగా ఒక మీడియా ప్రతినిధి నుంచి ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది మిమ్మల్ని కోలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టారట ఇందులో నిజం ఎంత ఉంది అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నిత్యా మీనన్ సమాధానం చెబుతూ నేను కోలీవుడ్ హీరో నన్ను ఇబ్బంది పెట్టారు అని ఎక్కడా చెప్పలేదు.

ఇలా చెప్పినట్లు వార్తలను ప్రచారం చేశారు కానీ తాను ఎక్కడ ఇబ్బంది పడలేదని నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదంటూ ఈ వార్తలను ఖండించారు.

గతంలో కోలీవుడ్ హీరో నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన నిత్యామీనన్ ఇప్పుడు లేదు అని చెప్పడంతో బహుశా ఇది అవాస్తవమా లేక నిత్యామీనన్ ఆ హీరోకి ఏమైనా భయపడి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube