మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణ జరపాల్సిన బెంచ్ లోని న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ అయింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ లో మొత్తం 44 మందిని ఆయన ప్రతివాదులుగా చేర్చారు.
ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీతో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రతివాదులుగా చేర్చబడ్డారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ ఓ వైపు, అక్రమ కేసు కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది.







