తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్( Nithya Menen ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యా మీనన్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
మొదట అలా మొదలైంది( Ala Modalaindi ) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అది తక్కువ సమయంలోనే భారీగా బాపులారిటీని సంపాదించుకుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, గీతా గోవిందం, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.ఇక చివరిగా భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ మధ్యకాలంలో నిత్యామీనన్ వెండితెరపై కంటే ఎక్కువగా ఓటీటీల్లో దాదాపుగా మూవీస్, వెబ్ సిరీసులు చేస్తూ ఆకట్టుకుంటోంది.ఈ క్రమంలోనే తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
బ్రీత్( Breathe ) అనే థ్రిల్లర్ వెబ్ సిరీసులో నటించిన నిత్యామేనన్.ఆ తర్వాత అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది.

మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.ఇప్పుడు శ్రీమతి కుమారి( Srimathi Kumari ) పేరుతో తీస్తున్న ఈ తెలుగు చిత్రాన్ని త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.దీన్నిబట్టి చూస్తుంటే నిత్యామేనన్.బిగ్ స్క్రీన్ కంటే ఓటీటీలకే ఓటేస్తుందని అనిపిస్తోంది.అంతేకాకుండా నిత్యామీనన్ కేవలం ఓటీటీ కే పరిమితం అవుతుండడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.







