నితిన్ 'మాస్ట్రో' నుండి ''వెన్నెల్లో ఆడపిల్ల'' సాంగ్ !

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త సినిమా మాస్ట్రో.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Nithin Maestro Movie Song Released, Nithin, Maestro, Final Schedule, Hyderabad ,-TeluguStop.com

ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.అందుకే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంటే తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది.

బాలీవుడ్ లో టబూ చేసిన రోల్ లో తమన్నా కనిపించే బోతుంది.తమన్నా ఈ సినిమాలో యాక్టింగ్ కుమ్మేసిందని ఇప్పటికే వార్తలు వినిపించాయి.ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి.తాజాగా ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేసారు.మాస్ట్రో మ్యూజిక్ ఫస్ట్ లో భాగంగా వెన్నెల్లో ఆడపిల్ల అనే సాంగ్ ప్రోమో వీడియోను విడుదల చేసారు.వినడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న ఈ పాట ప్రోమో కూడా చాలా అందంగా ఉంది.

ఈ సాంగ్ లో నితిన్ నభా నటేష్ కెమిస్ట్రీ బాగా కుదిరించి.

Telugu Andudan, Final Schedule, Hyderabad, Maestro, Nithin, Nithin Maestro, Rang

అనగనగా అందమైన కథగా మొదలైన ఈ పాట వినడానికి బాగుండడంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.ఫుల్ సాంగ్ ఆగస్టు 6 న విడుదల చేయబోతున్నారు.నితిన్ గత సినిమా రంగ్ దే విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో నితిన్ నిరాశ చెందాడు.

అందుకే నితిన్ ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్నాడు.మరి చూడాలి ఈ సినిమా నితిన్ కెరీర్ కు ఎంత ఉపయోగ పడుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube