పవన్ కళ్యాణ్ ను ప్రతి ఒక్కరు వాడుకోవడమే.. కానీ సపోర్ట్ చేయరు: నితిన్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ( Nithin) త్వరలోనే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary Man ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల ( Sree Leela ) నటిస్తున్నారు.

 Nithiin-speaks-about-pawan-kalyan, Nithiin, Pawan Kalyan, Tollywood, Ext-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నితిన్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Extra Ordinary, Nithiin, Pavitra Lokesh, Pawan Kalyan, Sree Leela, Tollyw

నితిన్ పవన్ కళ్యాణ్ ( Nithin Pawan Kalyan )కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన తన సినిమాలలో కొన్ని పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అలాగే అతని సిగ్నేచర్ మూమెంట్స్ కూడా చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే చాలామంది ఈయన తన సినిమాల కోసం పవన్ కళ్యాణ్ వాడుకుంటారు అన్న కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి.తాజాగా ఈ వ్యాఖ్యలపై నితిన్ మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ఉపయోగించుకుంటానని చాలా మంది అంటుంటారు కానీ నాకన్నా ఎక్కువ మంది హీరోలు వారి సినిమాలలో పవన్ పేరు తీసుకువస్తూ ఆయన క్రేజ్ వాడుకుంటున్నారని ఈయన తెలియజేశారు.

Telugu Extra Ordinary, Nithiin, Pavitra Lokesh, Pawan Kalyan, Sree Leela, Tollyw

ఈ సినిమాలో ఒక సీన్లో భాగంగా పవన్ కళ్యాణ్ మాదిరిగా తాను డ్రెస్ వేసుకున్నాను తప్ప ఫోటోషూట్ కోసం అలా చేయలేదని తెలిపారు.నేను హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి మాత్రం పెద్ద అభిమానిని అని ఈ సందర్భంగా నితిన్ తెలిపారు.ఇక రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కు మీ సపోర్ట్ ఉంటుందా అని ప్రశ్న కూడా ఈయనకి ఎదురు కావడంతో నితిన్ సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఆయనకు మాలాంటి వాళ్ళ అవసరం ఉండదు ఒకవేళ తనకు అవసరమైతే తప్పకుండా తనకు ఎప్పటికీ నేను సపోర్ట్ చేస్తాను అంటూ నితిన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube