‘మాచర్ల నియోజకవర్గం’లో నితిన్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవ ‘మాస్ట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాధున్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే వినాయక చవితి సందర్భంగా నితిన్ తన తాజా చిత్రాన్ని ప్రారంభించాడు.

నితిన్ కెరీర్‌లో 31వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఇవాళ ఉదయం జరిగింది.అయితే ఈ సినిమా నుండి తాజాగా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.దీంతో ఈ సినిమా టైటిల్ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలను కూడా ఆకట్టుకుంది.

Advertisement

ఇక ఈ సినిమాను ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కాగా ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మోషన్ పోస్టర్‌లో నితిన్ చాలా రఫ్ లుక్‌లో మనకు కనిపించాడు.ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తూ అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తుండగా, ఈ సినిమాలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరి ఈ సినిమా టైటిల్ లాగానే ఇంట్రెస్టింగ్‌గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిద్దాం.

కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి...
Advertisement

తాజా వార్తలు