నిర్భయ దోషులకు ఉరి ఖరారు,మార్చి 3 నే

2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో నిర్భయ దోషుల ఉరిశిక్షల విషయంలో కూడా సంచలనాలు నమోదు చేసుకుంటున్నాయి.నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇంకా నిర్భయ దోషులకు మాత్రం శిక్షలు అమలు కాలేకపోయాయి.

 Nirbhaya Convicts Now On March 3rd At 6 Am Says Court-TeluguStop.com

ఇటీవల ఈ కేసు ను విచారించిన ఢిల్లీ పాటియాల కోర్టు వారికి ఉరిశిక్షలు ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.కానీ దోషుల వరుస పిటీషన్ లతో ఈ నెల 1 వ తేదీన వారి ఉరిశిక్షలు అమలుకావాల్సి ఉండగా,జనవరి 31 న ఉరిశిక్షల పై స్టే విధిస్తూ అదే పాటియాల కోర్టు తీర్పు వెల్లడించింది.

దీనితో వారికి ఉరిశిక్షలు అమలు చేయడానికి కొత్త డెత్ వారెంట్ ఇవ్వాలి అంటూ తీహార్ అధికారులు పిటీషన్ దాఖలు చేయడం తో విచారణ చేపట్టిన న్యాయస్థానం కొత్త డెత్ వారెంట్ ను జారీ చేసింది.డిసెంబరు 16, 2012న ఢిల్లీలో ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ముఖేశ్ కుమార్ సింగ్, పవన్, వినయ్, అక్షయ్ దోషులు.

వీరికి మరణ శిక్షలు ఖరారయ్యాయి.అయితే దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది.

అటు దోషులు కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ తాత్సారం చేసుకుంటూ వచ్చారు.

అయితే తీహార్ జైలు అధికారుల కొత్త పిటీషన్ పై పాటియాలా కోర్టు తాజాగా ఆనలుగురు దోషులకు మార్చి 3 ఉదయం 6 గంటలకు ఒకేసారి ఉరిశిక్షలు అమలు పరిచేలా తీర్పు వెల్లడించింది.అయితే కోర్టు తాజా తీర్పు పై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేసారు.

ఏడాదిన్నరగా కోర్టుల చుట్టూ తిరుగూనే ఉన్నానని, ఈ సారి అయినా తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు.ఇక ఇదే తుది తీర్పు కావాలంటూ ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube