వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టిన నిమ్మగడ్డ

నిమ్మగడ్డ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయమై అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు నిమ్మగడ్డ తీరుపై మండి పడుతున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను నేడు విడుదల చేశాడు.

ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం రగడ మొదలవుతుంది.ప్రతి పక్ష పార్టీలు ఎన్నికలకు సిద్దం అవ్వాలని పిలుపునిస్తుంటే.

అధికార పార్టీ మాత్రం ససేమర అంటుంది.తాజాగా ఈ విషయంపై ఉద్యోగ సంఘాల సమాఖ్య నేత వెంకట్రామి రెడ్డి ఎస్‌ఈ‌సి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవరకు మేము ఎన్నికల విధులు నిర్వహించబోము అని తేల్చి చెప్పేశాడు.మాపై ప్రాణాలకు ముప్పు ఉన్నదని తెలుస్తే అదే రాజ్యాంగం ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కు కల్పించిందని అన్నాడు.

Advertisement

ఈ విషయంను ఎస్‌ఈ‌సి సీరియస్ గా తీసుకుంది.రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ రాశాడు.

ఉద్యోగ సంఘం సమాఖ్య నేత వెంకట్రామి రెడ్డి నుండి తనకు ప్రాణ హాని ఉందని తనకు రక్షణ కల్పించాలని.తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన కదలికపై నిఘా పెట్టాలని డి‌జి‌పి కి లేఖ రాశాడు.

Advertisement

తాజా వార్తలు