అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఉన్న తిక్క స్వభావాన్ని అందరూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుంటే ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలీ మాత్రం కొత్త అర్థాన్ని చెప్పారు.ట్రంప్ చర్యలు అమెరికాకి ఉపయోగ పడుతున్నాయి అంటూ మద్దతు ప్రకటించారు.
ఆయన ట్రంప్ వాక్చాతుర్యం, అనూహ్య స్వభావం.ఐక్యరాజ్యసమితిలో తన పని అవ్వడానికి ఎంతో సులభతరం అయ్యాయని ఆమె అన్నారు.
ఇదిలాఉంటే భారతీయ అమెరికెన్ అయిన నిక్కీ హెలీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గత నెలలో ప్రకటన చేయగా ఆ స్థానంలో ట్రంప్ వేరొక అధికారిని నియమించారు.2020 ఎన్నికల్లో అధ్యక్ష పీటంపై మీరు పోటీ చేస్తారా అనే విలేఖరులు అడిగిన ప్రశ్నలని హెలీ స్పందిచారు.అలాంటి ఆలోచనలు లేవని నా పూర్తి మద్దతు ట్రంప్ కే ఇస్తానని ఆమె ప్రకటించారు.
ఐరాసాలో తన పని ఎంతో సులభంగా అయ్యింది అంటే కారణం ట్రంప్ అని అన్నారు.ట్రంప్ ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు.భవిష్యత్తులో ఎలా ఉంటారో కూడా తెలియదు.
అంటూ ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్ ఇవ్వగలుగుతున్నాను అంటూ అది ట్రంప్ స్వభావం వల్లనే అంటూ ఆమె వ్యాఖ్యానించారు.