స్పై తర్వాత నిఖిల్ మరింత గొప్ప స్థాయికి చేరుకుంటాడు.. చైతూ కామెంట్స్ వైరల్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ( Nikhil Siddharth )తాజాగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ”స్పై”.( Spy movie ) ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

 Nikhil Will Reach Great Heights After The Release Of Spy,  Naga Chaitanya , Nikh-TeluguStop.com

బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రాబోతుంది.ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది.

ఇక ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఘనంగా చేసారు.హైదరాబాద్ లోని వెస్టిన్ హోటల్ లో గ్రాండ్ గా జరుగగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ( Naga Chaitanya )విచ్చేసారు.

ఇక చైతూ ఈ వేదికపై మాట్లాడుతూ.

నిఖిల్ అంటే తనకు చాలా ఇష్టం అని.స్వామిరారా, హ్యాపీడేస్, కార్తికేయ 1 అండ్ 2 వంటి మంచి సినిమాలు అందించిన నిఖిల్ ను చూసి గర్వపడుతున్న అని తెలిపారు.స్పై థ్రిల్లర్ సినిమాలు చేయడం చాలా కష్టం అని.తనకు స్పై టీజర్, ట్రైలర్ బాగా నచ్చాయని చైతూ చెప్పుకొచ్చారు.ఇక తన తరపున టీమ్ కు శుభాకాంక్షలు తెలిపి నిఖిల్ స్పై విడుదల తర్వాత గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.అలాగే ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్యన్ రాజేష్ కూడా కీలక పాత్రలో నటించాడు.ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

చూడాలి నిఖిల్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube