టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు.ఈయన ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ తర్వాత ఈయన పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరగడం విశేషం.
ప్రెజెంట్ నిఖిల్ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.
అందులో 18 పేజెస్ ఒకటి.కుమారి 21F సినిమా ఫేమ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్న విషయం తెలిసిందే.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమాలో కూడా కార్తికేయ 2 జోడీనే కనిపించ బోతున్నారు.అలాగే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
దీంతో ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా జరుగుతున్నాయి.
మరో పక్క ఈ సినిమా రిలీజ్ కు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఒక పోస్టర్ ద్వారా ఈ విషయాన్నీ అఫిషియల్ గా చెబుతూ ఈ సినిమాకు జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి అయ్యినట్టు తెలిపారు.దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తిగా ఉన్నారు.
చూడాలి మరి ఈ సినిమా కార్తికేయ 2 రేంజ్ లో అలరిస్తుందో లేదో.