మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై యంగ్ టాలెటెండ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్.న్యూ యేజ్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన 18 పేజెస్ పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.ఈ నేపథ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కంపోజ్ చేసిన 18 పేజీస్ ఫస్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
’నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూండేది.! ప్రేమించడానికి కారణముండకూడదు.
ఎందుకు ప్రేమించామా.? అంటే ఆన్సర్ ఉండకూడదు.’అని నిఖిల్ సంభాషణలతో మొదలైంది వీడియో.ఆ తర్వాత ‘నన్నయ్య రాసిన కావ్యమాగితే.తిక్కన తీర్చేనుగా.రాధమ్మ ఆపిన పాట మధురిమ.
కృష్ణుడు పాడెనుగా.’అని బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో సాగుతున్న ఈ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
అతి తర్వలో ఈ పాటకి సంబంధించిన ఫుల్ సాంగ్ ని విడుదలచేయడంతో పాటు మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత బన్నీవాసు తెలిపారు.
హీరో – నిఖిల్ సిద్ధార్థ్ హీరోయిన్ – అనుపమ పరమేశ్వరన్







