నిఖిల్ నమ్మకాన్ని దెబ్బకొట్టిన కోన

‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రాలతో హ్యాట్రిక్‌ను దక్కించుకున్న నిఖిల్‌ ‘శంకరాభరణం’తో మరో సక్సెస్‌ను అందుకోవడం ఖాయం అని సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు కూడా భావించారు.

వరుసగా మూడు సినిమాల సక్సెస్‌ మరియు ఈ సినిమా సక్సెస్‌ అవ్వబోతుండటంతో నిఖిల్‌ క్రేజ్‌ మరింతగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడ్డారు.

కాని ‘శంకరాభరణం’ సినిమా నిఖిల్‌కు పెద్ద ఎదురు దెబ్బ కొట్టింది.తప్పకుండా సక్సెస్‌ అవుతుందని భావించిన ‘శంకరాభరణం’ చిత్రం బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడటం జరిగింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రం సాదా సీదాగానే ఉంది అనే టాక్‌ వచ్చింది.ఈ సినిమా తర్వాత నిఖిల్‌ క్రేజ్‌ మరింత పెరుగుతుందని అనుకుంటే, ఆ మూడు సినిమాలతో వచ్చిన పేరు కాస్త పోగొట్టుకున్నాడు.

నిఖిల్‌కు సక్సెస్‌ ఆనందం మూడు నాళ్ల ముచ్చటగానే మారి పోయింది.కథల ఎంపికలో నిఖిల్‌ను చూసి అంతా నేర్చుకోవాలని సినీ వర్గాల వారు అంటారు.

Advertisement

కాని నిఖిల్‌ ఈ సినిమాను కోనపై నమ్మకంతో చేయడం జరిగింది.కాని నిఖిల్‌ నమ్మకం వమ్ము అయ్యింది.

మరి ఇప్పటి నుండి అయినా నిఖిల్‌ కాస్త జాగ్రత్తగా కథలను ఎంచుకుంటాడని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు