“ NIHWN ” - కరోనా సెల్ఫ్ అసిస్టెన్స్ కోసం ఇండియాలోనే బెస్ట్ యాప్..!!!!

కరోనా వైరస్ మహమ్మారి వికృత విలయతాండవం చేస్తూ 135 కోట్ల భారతీయులు 769 కోట్ల యావత్ మానవాళి ఉనికే ప్రశ్నార్థకమైన ఈ సమయంలో పరిమిత ఆరోగ్య వనరులు కోటానుకోట్ల జనాభా ఉన్న మన ప్రపంచంలో ప్రజలు కరోనా వైరస్ యొక్క ముప్పు తమకూ, తమ కుటుంబ బంధు మిత్రులకు ఎంత ఉందో తమంతట తామే తెలుసుకోవడానికి ఉపకరించే టెక్నాలజీ సొల్యూషన్ల అవసరం ఎంతైనా ఉంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టంగా ప‌రిణ‌మించిన క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19)పై అనేక వార్త‌లు వైర‌ల్ అవు తున్నాయి.

వీటిలో ఏవి న‌మ్మాలి? ఏవి న‌మ్మ‌కూడ‌దు? అనేది ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌.ఈ క్ర‌మంలోనే మ‌న‌కు క‌రోనా ఉందా ? లేదా ? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.అస‌లు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయో ? లేదో ? కూడా చాలా మందికి తెలియ‌ని ప‌రిస్థితి.ఈ నేప‌థ్యంలోనే టెక్ దిగ్గ‌జం కోటి గ్రూప్‌కు చెందిన NIHWN.

Co - నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్ అద్భుత‌మైన ఇంటిలిజెన్స్ ఇంజ‌న్ సంజీవ‌న్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది.వీళ్ల‌ ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫలితమే ఈ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన హెల్త్ వెల్ నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ సంజీవన్.

ఇందులో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్‌ల నుంచి https://tinyurl.com/NIHWNgoogle or Apple Appstore https://tinyurl.com/NIHWNapple ల‌ను డౌన్ చేసుకుని క‌రోనాపై స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.ఇక‌, కోటిరెడ్డి ఫౌండేష‌న్ ఈ విష‌యంలో అమెరికాలోని హార్వ‌ర్డ్ గ్లోబ‌ల్ హైతోను, ఏపీలోని శ్రీవెంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌తోను ఒప్పందం చేసుకుని వారి నుంచి కూడా స‌మాచారాన్ని సేక‌రించి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తుండ‌డం గొప్ప‌విష‌యం.ఈ రెండు యాప్‌ల ద్వారా మీకు మీ పరివారానికి కరోనా వైరస్ రిస్క్ ఎంత ఉందో, ప్రభుత్వ సహాయ వనరులు మరియు కోవిడ్ -19 రిస్క్ పూర్తి విశ్లేషణాత్మక రిపోర్ట్ తో సహా ఇప్పుడే పూర్తి ఉచితంగా తెలుసుకోవ‌చ్చు.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు