మెగా ఫ్యామిలీ నుండి సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారిక ( Niharika ) కు పేరు ఉంది.నిహారిక మొదట్లో యాంకర్ గా రాణించి ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే ఒక షార్ట్ ఫిలిం లో చేసింది.అంతేకాకుండా నాగశౌర్య ( Naga shourya ) హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారింది.కానీ హీరోయిన్ గా ఈమె కు అంతగా గుర్తింపు రాకపోయేసరికి పెళ్లయ్యాక సినిమాలు మానేసి నిర్మాతగా రానిద్దాం అనుకుంది.
అయితే ఈమె సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, నాన్న కూచి,సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల్లో మెప్పించింది.ఇక విడాకులు అని వార్తలు వినిపించిన తర్వాత ఈ ఏడాది డెడ్ పీక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

అంతేకాకుండా ప్రస్తుతం సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేయాలి అని నిహారిక భావిస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని సమాచారం.ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ లాంటి న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.అదేంటంటే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందట.అయితే నిహారిక రెండో పెళ్లి అనేది తన నిర్ణయం కాదట. నాగబాబు ( Naga babu ) తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిహారికకి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారట.
ఇక టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం నిహారిక ( Niharika ) కు విడాకులై ఇంట్లో ఉండగా వరుణ్ తేజ్ పెళ్లి చేస్తే పదిమంది పది రకాలుగా మాట్లాడుకుంటారనే ఉద్దేశంతో నిహారిక కి కూడా రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారట.
మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ ( Varun tej ) పెళ్లి లోనే నిహారికకి కూడా రెండో పెళ్లి చేయాలని నాగబాబు చూస్తున్నారని నెట్టింట్లో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఇప్పటికే నిహారికకు అబ్బాయిని కూడా సెట్ చేసి పెట్టారని, ఆ అబ్బాయి తండ్రి నాగబాబుకి ఫ్రెండ్ అని తెలుస్తోంది.ఇక సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని బిజినెస్ మాన్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయిని నాగబాబు తన కూతురు నిహారిక ( Niharika ) కు ఇచ్చి రెండో పెళ్లి చేస్తున్నారని సమాచారం.మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







