ఏడాదికే విడిపోతామని అనుకోలేదు.. మొదటిసారి విడాకులపై నిహారిక కామెంట్స్!

మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా నిహారిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన విడాకుల విషయంపై పెళ్లి విషయంపై అలాగే తన కెరీర్ విషయంపై అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న అనేక ప్రశ్నలకు ఇండైరెక్టుగా సమాధానం చెప్పింది నిహారిక.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.పెళ్లి బంధం ఏడాదిలోనే ముగుస్తుంద‌ని తాను అనుకోలేదు.

ఎవ‌రిని ఈజీగా న‌మ్మ‌కూడ‌దు.ఆ విషయం పెళ్లి తర్వాతే అర్థం చేసుకున్నాను.

Advertisement

అది నాకు ఒక అనుభవపాఠంగా భావించి ముందుకు సాగడం అలవాటు చేసుకున్నాను అని తెలిపింది నిహారిక.ఇప్ప‌టికీ అవ‌న్నీ గుర్తొస్తే క‌న్నీళ్లు వ‌స్తుంటాయి.పెళ్లి( Marriage ) అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఎంతో ముఖ్య‌మ‌నై ఘ‌ట్ట‌ం.

క‌ల‌కాలం క‌లిసి ఉంటామ‌నే ఏ జంట‌నైనా పెళ్లి చేసుకుంటారు.అంతేకానీ ఏడాదిలో విడిపోతామ‌ని అనుకొని భారీగా ఖ‌ర్చుపెట్టి ఎవ‌రూ పెళ్లిచేసుకోర‌ని తెలిపింది నిహారిక.

ఎలాంటి అడ్డంకులు లేకుండా త‌మ రిలేష‌న్‌షిప్ సాఫీగా సాగాల‌నే అనుకుంటారు.ఆలా ఆలోచించే ప్రేమ‌, పెళ్లి బంధాల్లోకి అడుగుపెడ‌తారు.

నేను అలాగే ఆలోచించాను.కానీ నేను ఊహించిన‌ట్లు జ‌ర‌గ‌లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అందుకే ఆ బంధాన్ని ముగించాల్సివ‌చ్చింది అని నిహారిక తెలిపింది.

Advertisement

నా కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అన్న‌దే నాకు ముఖ్యం.అంతే కానీ నాకు తెలియ‌ని వారు నాతో సంబంధం లేని ఏమ‌నుకున్నా ప‌ట్టించుకోను.గ‌త రెండేళ్ల‌లో ఫ్యామిలీ విలువ‌ను చాలా అర్థం చేసుకున్నాను అని తెలిపింది నిహారిక.

అలాగే నన్ను బ‌ర్డెన్‌గా మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఏ రోజు భావించ‌లేద‌ని తెలిపింది నిహారిక.ఈ సందర్భంగా నిహారిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్( Social Media ) అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

ఇకపోతే నిహారిక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందట.దాదాపు మళ్లీ ఐదేళ్ల తర్వాత ఆమె సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.అందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు