మెగా బ్రదర్ నాగబాబు వారసురాలు నిహారిక బుల్లి తెరపై గత కొంత కాలంగా సందడి చేస్తున్న విషయం తెల్సిందే.మీడియా రంగంపై ఈమెకు ఉన్న అభిరుచితో ఎన్నో కార్యక్రమాల్లో ఈమె పాలు పంచుకుంది.
ఈమె గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.మంచు లక్ష్మి తరహాలోనే మె కూడా వెండి తరపై తనదైన ముద్రను వేసేందుకు తహతహలాడుతోంది.
ఇప్పటికే కుటుంబం నుండి కూడా ఈమెకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.దాంతో ఈమె మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక ఎంట్రీ మూవీ దాదాపుగా ఖరారు అయ్యింది.ఈమె బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పీకూ’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
నటిగా తన సత్తా చాటాలి అంటే ఇలాంటి పాత్రలు చేయాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.సురేష్‌బాబు ఈ రీమేక్‌కు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఈ రీమేక్‌లో వెంకటేష్‌కు నిహారిక కూతురుగా కనిపించనుంది.ఇదే సినిమాలో వెంకటేష్‌కు సమంత కూతురుగా నటించనుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజమే తేలాల్సి ఉంది.







