ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సినిమాల లెక్క పెంచట్లేదు కానీ రోజు రోజుకి అమ్మడి క్రేజ్ మాత్రం పెరుగుతుంది.గల్లా అశోక్ తో హీరో సినిమా చేసిన నిధి అగర్వాల్ ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తుంది నిధి.సినిమాలతో సంబంధం లేకుండా నిధి అగర్వాల్ సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తుంది.
కొన్ని బ్రాండ్ లకు తన ఇన్ స్టాగ్రాం లోనే ప్రమోట్ చేస్తూ సంపాదిస్తుంది నిధి.
అమ్మడి హాట్ ఫోటో షూట్స్ కూడా కుర్రాళ్లని అలరిస్తున్నాయి.
లేటెస్ట్ గా బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ తో నిధి షేర్ చేసిన ఫోటో షూట్ అదిరిపోయింది.ఓ విధంగా చెప్పాలంటే నిధి అగర్వాల్ ని మన దర్శక నిర్మాతలు సరిగా వాడుకోవట్లేదని చెప్పొచ్చు.
అమ్మడు లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సరైన అవకాశం ఇస్తే చెలరేగిపోవడం గ్యారెంటీ.ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా చేయని నిధి ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
పవన్ సినిమా హిట్ పడితే మళ్లీ అమ్మడికి వరుస ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు.







