వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్సీ నంబర్ల రేట్లు భారీగా పెరిగాయి!

ఈరోజుల్లో వాహనం వాడాలన్నది పరిపాటిగా మారింది.దగ్గర దూర ప్రాంతాలకు వాహనాలు లేకుండా వెళ్లాలంటే ఏంటో సమయం వృధా అవుతున్నది.

 Bad News For Motorists The Rates Of Fancy Numbers Have Increased Hugely, Bad New-TeluguStop.com

అందువలన నేడు ప్రతిఒక్కరు వాహనం కొనుక్కుంటున్నారు.ఈ క్రమంలో ఇపుడు ప్రతి ఇంట్లో ఒక్క బైక్ అయినా కొలువు దిరుతోంది.

ఈ క్రమంలోనే బండి నెంబర్స్ కి విపరీతంగా డిమాండ్ ఏర్పడుతోంది.ముఖ్యంగా ఫాన్సీ నెంబర్ ఉండాలని మనలో ఎంతోమంది కలలు కంటారు.

అందువలనే ఈ నెంబర్లకు మార్కెట్లో లక్షలు డిమాండ్ ఏర్పడింది.

ఇక కారు కొన్నవారు అయితే చెప్పనవసరం లేదు.

నచ్చిన నంబర్‌ ఉండాలన్నది వీరికి సెంటిమెంట్‌.లక్కీ నంబర్‌ కావాలని చాలామంది ఆశ పడుతుంటారు.

ఇందు కోసం ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి సిద్ధంగా వుంటారు.ఏడాది క్రితం రూ.50 వేలు ప్రారంభ ధర ఉన్న 9999 నంబర్‌ వేలంలో రూ.7.20 లక్షలు పలికిందంటే అర్ధం చేసుకోవచ్చు.అనంతపురానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఈ నంబర్‌ కోసం పోటీ పడి మరీ దక్కించుకున్నాడు.

ఫ్యాన్సీ నంబర్‌ రూపంలో రవాణా శాఖకు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది.కాగా గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అనంతపురం ఆర్టీఓ సురేష్‌ నాయుడు తెలిపారు.ఈ ధరలు క్రింది విధంగా వున్నాయి.

1.9999 నంబరుకు రూ.2 లక్షలు

2.1, 9, 999 నంబర్లకు రూ.1 లక్ష

3.99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు రూ.50వేలు

4.5, 6, 7, 333, 369, 555, 666, 777, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 నంబర్లకు రూ.20 వేలు

5.3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999,7999, 9009 నంబర్లకు రూ.15వేలు

6.2, 4, 8, 18, 27, 36, 45, 77, 143, 222, 444, 786, 789, 909, 1122, 1233, 1269, 1314, 1359, 2223, 2255, 2349, 3344, 3399, 3555, 3789 నంబర్లకు రూ.10 వేలు చొప్పున ప్రారంభ ధరలుగా నిర్ణయించారు.పోటీని బట్టి సదరు నంబర్‌కు ఎంత ధర అయినా పలకవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube