ఉదయం పెళ్లి చేసుకున్నారు,సాయంత్రం జైల్లో కూర్చోవాల్సి వచ్చింది!

ఉదయం పెళ్లి ఏంటి,సాయంత్రం జైల్లో కూర్చోవడం ఏంటి అని అనుకుంటున్నారా.ఈ చిత్రమైన ఘటన అమెరికా లోని అరిజోనా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.అరిజోనాలో నివాసముండే యాష్లే జోర్డాన్(30) అనే యువతికి ఎరిక్ కార్డోవా(31) అనే యువకుడితో శనివారం ఉదయం ప్రెస్కోట్‌‌లో ఘనంగా వివాహమైంది.

ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్నేహితులు, బంధువులకు విందు ఇచ్చారు.రిసెప్షన్ ముగిశాక బయటకు వెళ్లిన జోర్డాన్ ఒక చిన్న దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి తో వాగ్వివాదానికి దిగింది.

ఈ క్రమంలో జోర్దాన్ ఆ దుకాణ దారుడిపై చేయి కూడా చేసుకోవడం వివాదంగా మారింది.తన పై చేయి చేసుకుంది అంటూ ఆ బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం తో ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు.

Advertisement

అయితే అదే సమయంలో జోర్దాన్ తో ఆమె భర్త కార్డోవా కూడా ఉండడం తో ఇంటికి వచ్చిన పోలీసుల పై దురుసుగా ప్రవర్తించాడు.ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకోవడంతో ఎరిక్ కింద కూడా పడ్డాడు.

దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన జోర్డాన్ నా భర్తనే తోసేస్తారా.అంటూ పోలీసుపై ఆవేశం తో ఏకంగా చేయి చేసుకుంది.

ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటన తో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.ఇలా విధుల్లో ఉన్న అధికారిపై చేయి చేసుకుంది అన్న నేరానికి పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

  అయితే ఉదయమే వారి పెళ్లి అయ్యింది,వదిలేయాలి అని జోర్దాన్ బంధువులు ఎంతగా ప్రాధేయపడినా పోలీసులు వినకుండా వారి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తుంది.మొత్తానికి జోర్దాన్ ఆవేశం కారణంగా చక్కగా హ్యాపీగా ఉండాల్సిన ఆ జంట ఇలా పోలీస్ స్టేషన్ లో గడపాల్సి వచ్చింది.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు