‘గ్రీన్ లైట్ లా’కు లైన్ క్లియర్: న్యూయార్క్‌లో అక్రమ వలసదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు

న్యూయార్క్‌లో అక్రమ వలసదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందేందుకు అనుమతించే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఫెడరల్ న్యాయస్థానం తిరస్కరించింది.

న్యూయార్క్ ఉత్తర జిల్లాకు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి గ్యారీ షార్ప్ .

రెన్సేలేర్ కౌంటి క్లర్క్ ఫ్రాంక్ మెరోలా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు.ఈ కొత్త చట్టాన్ని పాటించడం వల్ల ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టంతో ప్రత్యక్ష వివాదానికి దారి తీస్తుందని క్లర్క్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించడానికి సరైన కారణం లేదని న్యాయమూర్తి షార్ప్ వ్యాఖ్యానించారు.అదే సమయంలో ఈ కొత్త చట్టం యొక్క చట్టబద్ధతను షార్ప్ ధృవీకరించలేదు.

కొత్తగా ప్రవేశపెట్టిన ‘‘గ్రీన్ లైట్ లా’’ శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది.దీని ప్రకారం అమెరికా పౌరులుగా నమోదు కానీ వ్యక్తులు సైతం మోటారు వాహనాల విభాగం నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మరోవైపు ఫెడరల్ జడ్జి తీర్పుపై మెరోలా స్పందించలేదు.కోర్టు తీర్పు తన కార్యాలయానికి లభించిన విజయంగా అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ అభివర్ణించారు.గ్రీన్ లైట్ లా చట్టబద్దమైనదని, అమలు చేయడానికి అర్హత కలిగినదిగా అటార్నీ వ్యాఖ్యానించారు.

అందుకు తగ్గట్టుగానే రెండు ఫెడరల్ కోర్టులు దీనికి విరుద్ధంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేశాయని ఆమె గుర్తుచేశారు.అక్రమ వలసదారులకు వెసులుబాటు కలిగించే గ్రీన్ లైట్ లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కోర్టులు తిరస్కరించడం ఇది రెండోసారి.

Advertisement

తాజా వార్తలు