భారత సంతతికి చెందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూయర్ , రచయిత్రి అను సెహగల్‌ను( Anu Sehgal ) న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్( New York City Mayor Eric Adams ) సత్కరించారు.భారతీయ సంస్కృతిని ఇక్కడి ఎన్ఆర్ఐల పిల్లలకు( NRI Children ) నేర్పడంతో పాటు కల్చరల్ ఎక్స్చేంజ్( Cultural Exchange ) కోసం శ్రమించినందుకు గాను ఆమెకు ఈ గౌరవం దక్కింది.
మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ (ఏఏపీఐ) హెరిటేజ్ రిసెప్షన్ 2023లో ‘‘ ది కల్చర్ ట్రీ ’’ ( The Culture Tree ) వ్యవస్థాపకురాలు, ప్రెసిడెంట్ అను సెహగల్‌ను ఆడమ్స్ సత్కరించారు.భారతీయ కమ్యూనిటీ, ఏఏపీఐ కమ్యూనిటీలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో అవార్డ్ పొందిన ఆరుగురిలో అను ఏకైక దక్షిణాసియా సంతతి వ్యక్తి.
దాదాపు రెండు దశాబ్ధాలుగా న్యూయార్క్‌ను సుసంపన్నం చేస్తున్న అను సెహగల్ విజయాలను గుర్తించడం తనకు సంతోషంగా వుందని ఎరిక్ ఆడమ్స్ పేర్కొన్నారు.
భారత్‌లో పుట్టిపెరిగిన అను సెహగల్.1995లో ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వలసవెళ్లారు.ఈ క్రమంలో అక్కడే స్థిరపడిపోయిన అను సెహగల్‌కు అమెరికాలోని భారతీయ, దక్షిణాసియా సంతతిలకు చెందిన పిల్లలకు మన సంస్కృతిని నేర్పించాలన్న లక్ష్యంతో ‘‘ ది కల్చర్ ట్రీ’’ అనే సంస్థను స్థాపించారు.
యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న అను సెహగల్.తొలుత ఫైనాన్స్‌లో ఆ తర్వాత మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్‌మెంట్‌కు మారారు.అయితే తల్లిగా మారిన తర్వాత తన పిల్లలకు స్వీయ అవగాహన, ఆత్మ విశ్వాసం గల వ్యక్తులుగా మారడానికి వారసత్వం, సంస్కృతి, భాషపై అవగాహన కీలకమని తాను నమ్మినట్లు అను చెబుతారు.మీరట్‌లో ముస్లిం తల్లి, హిందూ తండ్రి పెంపకంలో పెరిగిన అను సెహగల్ అమెరికాలో వున్న భారతీయ పిల్లలకు మన సంస్కృతి గొప్పదనాన్ని తెలిసేలా చేయాలనే లక్ష్యంతోనే ‘‘ ది కల్చర్ ట్రీ’’ని స్థాపించారు.
తొలుత తన ఇద్దరు పిల్లలు గురించి మాత్రమే రూపొందించిన ఈ కార్యక్రమానికి అనతికాలంలోనే 13 మంది పిల్లలు జత కలిశారు.భాషకే ప్రాధాన్యతను ఇచ్చినప్పటికీ , సాంస్కృతిక కార్యక్రమాలు, కుకింగ్ క్లాసులను ప్రారంభిస్తూ వచ్చారు.తొలుత 4 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకు భాషా తరగతులు ప్రారంభించినప్పటికీ దానిని ఇప్పుడు ఇతర వయసుల వారికి కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించారు అను సెహగల్. మ్యూజియంలు, గ్యాలరీలు, పాఠశాలలు, లైబ్రరీలు కూడా ఆమెతో చేయి కలిపాయి.
కీలకమైన పండుగలు, ఈవెంట్‌లు, తోలు బొమ్మల ప్రదర్శనలు, దక్షిణాసియాకే చెందిన విభిన్నమైన వంటకాలు తినడం వంటి కార్యక్రమాలను కల్చర్ ట్రీ నిర్వహిస్తోంది.హిందీ, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ తదితర హిందుస్థానీ భాషలల్లో కల్చర్ ట్రీ విస్తరిస్తోంది.
ముఖ్యంగా అను సెహగల్ నిర్వహించే తోలు బొమ్మ ప్రదర్శనలకు మంచి గుర్తింపు లభిస్తోంది.అమెరికాతో పాటు సింగపూర్, భారత్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె ప్రదర్శనలిచ్చారు.