వాట్సాప్ లో ఈ సమయాన్ని పెంచబోతున్నారు !

వాట్సాప్‌లో పొరపాటున ఎవరికైనా తప్పుడు మెసేజ్‌ పంపిస్తే ఏం చేస్తారు ? గతంలో ఐతే.చేసేది లేక అవతల వ్యక్తిని ఏదోలా కన్విన్స్‌ చేసేవారు.

కానీ.కొన్ని రోజుల క్రితం డిలీట్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఏదైనా మెసేజ్‌ను సెలక్ట్‌ చేసుకుని డిలీట్‌ బటన్‌ నొక్కగానే డిలీట్‌ ఫర్‌ మి, డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.మొదటి ఆప్షన్‌ను ఎంచుకుంటే మన ఫోన్‌లో మాత్రమే మెసేజ్‌ డిలీట్‌ అవుతుంది.

రెండో ఆప్షన్‌ను ఎంచుకుంటే మెసేజ్‌ ఎవరికి పంపామో వారికి కూడా కనిపించకుండా పోతుంది.

Advertisement

మెసేజ్‌ పంపిన గంటా 8 నిమిషాల 16 సెకెన్ల వరకే ఈ డిలీట్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది.అంటే.ఈ వ్యవధి దాటితే డిలీట్‌ ఫర్‌ మి ఆప్షన్‌ మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.

ఇప్పుడు ఈ సమయాన్ని 13 గంటల 8 నిమిషాల 16 సెకెన్లకు పెంచాలని వాట్సాప్‌ యోచిస్తోంది.అతిత్వరలోనే ఈ అప్‌డేట్‌.యూజర్లకు అందుబాటులోకి వస్తుందని డెవలపర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు