టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై సిట్ అధికారుల దర్యాప్తులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్ ఏఈ పేపర్ తో సుమారు రూ.25 లక్షలు వసూలు చేసాడని తెలుస్తోంది.నీలేశ్, గోపాల్ నాయక్ లు పొలం తాకట్టు పెట్టి మరీ రూ.13.5 లక్షలు చెల్లించారు.అదేవిధంగా రాజేందర్ రూ.5 లక్షలు, ప్రశాంత్ రూ.7.5 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో డాక్యా నాయక్ కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు.