కొడాలి ఇలాకాలో టీడీపీ కొత్త స్కెచ్.. ఈ సారి నానికి తిప్ప‌లు త‌ప్ప‌వా..!

కొడాలి నాని మాట్లాడ‌టం మొద‌లు పెడితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే.త‌న దైన శైలిలో మాట్లాడుతూ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌తారు.

 New Sketch Of Tdp In Kodali Ilaka , Kodali Nani, Devineni Smitha, Gudivada, Tdp,-TeluguStop.com

ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో మంచి ప‌ట్టు సాధించారు.గుడివాడ నానికి కంచుకోట అంటుంటారు.

అసెంబ్లీ ఎన్నిక అయితే చాలు కొడాలికి తప్పించి మరెవరికీ అవకాశం లేదన్నట్లుగా ఇక్కడ పరిస్థితి ఉంటుందని చెబుతారు.ఒకప్పుడు టీడీపీ నేతగా సుపరిచితుడైన కొడాలి నాని ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు.

ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో తొలి ద‌శ‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకుని ప్ర‌తిప‌క్షం టీడీపీపై తీవ్ర స్థాయ‌లో మండిప‌డుతూ ఏకంగా చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు ఎక్కుపెడ‌తారు.అయితే కొడాలికి గుడివాడ‌లో బ్రేక్ వేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నించినా స‌క్సెస్ కాలేదు.

ఇక గత ఎన్నికల్లో కొడాలి దూకుడుకు బ్రేకులు వేసేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేసింది.అందులో భాగంగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను ప్రయోగించింది.అయితే చంద్రబాబు అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితులు ఉండటంతో ఆ ప్రయోగం బెడిసికొట్టింది.అవినాష్ వైసీపీలోకి జంప్ కావటం టీడీపీకి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం గుడివాడ పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు కొడాలికి చెక్ పెట్టేంత బలం లేదు.దీంతో కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు.

అందులో భాగంగా పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు.

చలసాని పండు కుమార్తె అయితే ఈసారి మాత్రం గుడివాడ‌ను మిస్ చేసుకోకూడ‌ద‌నే పట్టుదలతో టీడీపీ ఉంద‌ని అంటున్నారు.

గుడివాడలో కొడాలిని ఢీ కొట్టేంత బలమైన నాయకుడు టీడీపీలో లేరు.అయితే ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో దెబ్బ తీసేందుకు అవసరమైన అన్ని బలాలు ఉన్న అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే దేవినేని స్మిత విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.క్రిష్ణాజిల్లాలో రాజకీయ గురువుగా సుప్రసిద్ధులైన చలసాని పండు కుమార్తె ఈ స్మిత.పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతగా సుపరిచితులైన చలసాని పండు ఇప్పుడు లేరు.దీంతో ఆయన రాజకీయ వారసురాలిగా స్మిత తెర మీదకు వచ్చారు.

Telugu Devineni Smitha, Gudivada, Kodali Nani-Political

వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేయాలన్నది ఆలోచన.అయితే చంద్రబాబు లోకేశ్ సూచనతో ఆమె గుడివాడ బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే స్మితతో కొడాలికి చెక్ పెట్టటం సాధ్యమా.? అంటే అవుననే చెబుతున్నారు.కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉండటం.బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం.మహిల కావటం.చలసాని అనుచరుల బలం.టీడీపీ కార్డు.ఇలా అన్ని ఆమెకు సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

అయితే కొడాలి నానికి మహిళల విషయంలో ఆయనకు అంత సానుకూలత లేని వేళ.స్మితతో ఆయనకు దెబ్బ కొట్టొచ్చొన్న ఆలోచనతో టీడీపీ ఉన్నట్లు చెబుతున్నారు.మహిళా అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు నోటిని ఏ మాత్రం అదుపులోకి పెట్టుకోకుండా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు.మ‌రి కొడాలికి బ్రేక ప‌డుతుందా.మ‌రోసారి త‌న ఇలాకాలో అధికారం చ‌లా ఇస్తారా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube