పవన్, ప్రభాస్ డైరెక్టర్లకు వింత కష్టాలు.. సినిమా హిట్టైనా ఆఫర్లు రావా?

సినిమా రంగంలో సక్సెస్ సాధించడంతో పాటు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం దర్శకులకు కీలకమనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోలతో తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే దర్శకులకు స్టార్ డైరెక్టర్ స్టేటస్ వస్తుంది.

 New Problems For Prabhas Pawan Kalyan Movie Directors Details Here Goes Viral ,-TeluguStop.com

ఒకవేళ ఏదైనా కారణం వల్ల సినిమా ఫ్లాప్ అయితే ఆ దర్శకునికి మరో ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు, చిన్న హీరోలు సైతం భయపడతారనే సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా గతేడాది ఏప్రిల్ నెలలో థియేటర్లలో విడుదలై హిట్ గా నిలిచింది.

ఏపీలో టికెట్ రేట్లను తగ్గించకుండా ఉండి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ మరో సినిమాను ఇప్పటివరకు మొదలుపెట్టలేదు.

వకీల్ సాబ్ హిట్టైనా వేణు శ్రీరామ్ కు ఛాన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ హీరోలు వెనుకడుగు వేస్తున్నారు.

Telugu Bhimla Naik, Directors, Pawan Kalyan, Prabhas, Sagar Chandra, Sujith, Vak

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమా సక్సెస్ సాధించినా సాగర్ కె చంద్రకు కొత్త సినిమా ఆఫర్లు రావడం లేదనే విషయం తెలిసిందే.పవన్ తో హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులకు సైతం ఆఫర్లు రావడం లేదు.అయితే ప్రభాస్ తో సినిమా తీసి ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న దర్శకులకు సైతం ఇదే పరిస్థితి నెలకొంది.

Telugu Bhimla Naik, Directors, Pawan Kalyan, Prabhas, Sagar Chandra, Sujith, Vak

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా ఈ దర్శకుడికి ఈ మధ్య కాలంలో పలు ప్రాజెక్ట్ లకు ఈ డైరెక్టర్ పేరు వినిపించినా ఫైనల్ కాలేదనే సంగతి తెలిసిందే.రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కు కూడా కొత్త ఆఫర్లు రావడ్ం లేదు.ప్రభాస్, పవన్ డైరెక్టర్లు ఆఫర్లు లేక ఖాళీగా ఉండటంతో ఆయా హీరోల అభిమానులు ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube