తన సహజ నటనతో వెండితెరకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి స్నేహ గురించి అందరికీ సుపరిచితమే.ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
అయితే ఈమె సినిమాలలో ఎక్కడ గ్లామర్ షోకి తావు లేకుండా ఎంతో సాంప్రదాయ బద్దంగా సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న స్నేహ తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను వివాహం చేసుకొని పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.
అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో కొనసాగుతున్నారు.ఇలా పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా తన తండ్రి పుట్టిన రోజు వేడుకలలోనూ అలాగే తన కొడుకు విహాన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను స్నేహ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో వీరి క్యూట్ ఫ్యామిలీని చూసి ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా స్నేహ తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలువురు అతిథులతో పాటు సీనియర్ హీరోయిన్లైనా రంభ, శ్రీదేవి విజయ్ కుమార్ వంటి నటీమణులను కూడా ఈ పూజకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఈ హీరోయిన్లతో స్నేహతో కలిసి దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







