హీరో ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా 'బేబీ' సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా బేబీ ఈ చిత్రాన్ని మాస్ మూవీ, మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

 New Poster Release From 'baby' Movie On The Occasion Of Hero Anand Devarakonda's-TeluguStop.com

విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే.వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు.

రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి.

ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్.న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.

నిర్మాత: ఎస్.కే.ఎన్ నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్, రచన, దర్శకత్వం: సాయి రాజేష్, సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి సంగీతం: విజయ్ బుల్గానిన్ ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ ఆర్ట్: సురేష్, సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్, చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టి, పీఆర్వో: ఏలూరు శీను & జి.ఎస్.కే మీడియా, కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube