ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మీ రీసెంట్‌గా తన 240W SuperVOOC ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది.ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మొట్టమొదటిగా అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ ‘రియల్‌మీ జీటీ నియో 5’లో అందించనుంది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023) సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా అందుబాటులోకి వస్తుందని టాక్.

రూమర్స్ ప్రకారం, రియల్‌మీ జీటీ నియో 5 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.దీని బ్యాక్‌సైడ్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇస్తారు.ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
రిపోర్ట్స్ ప్రకారం, రియల్‌మీ జీటీ నియో 5 క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.దీనిలో ఆండ్రాయిడ్ 13 ఓఎస్, రియల్‌మీ UI 4.0 కస్టమ్ స్కిన్ అందించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్లతో రానుందని సమాచారం.4,600mAh బ్యాటరీ కెపాసిటీకి వచ్చే ఈ మొబైల్ 240W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది.5,000mAh బ్యాటరీతో వచ్చే ఇతర వేరియంట్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.వీటి ప్రీమియం ఫీచర్లు చూస్తుంటే దీని ధర చాలా అధికంగానే ఉండొచ్చని తెలుస్తోంది.ఓన్లీ 50 రూపాయల కు పైగా డబ్బులు ఖర్చు చేయాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉండవచ్చు.







