దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాయలం ముస్తాబవుతోంది.ఈనెల 14వ తేదీన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఇప్పటికే ఎస్పీ రోడ్ గులాబీమయంగా మారడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా కేసీఆర్, బీఆర్ఎస్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ఎంపీలు పరిశీలించారు.ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ రేపు స్వయంగా పార్టీ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
బీఆర్ఎస్ కార్యాలయం లాన్ లో యాగశాలను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.రాజశ్యామల, నవచండీ సహా మూడు యాగాలు నిర్వహించనున్నారు.
అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం పూర్ణాహుతితో పాటు పలు పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.