గ్రామీణ ప్రజల కోసం సరికొత్తగా మైక్రోసాఫ్ట్ జుగల్బందీ టూల్..!

గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి, పట్టణాలలో ఉండే వారికి చాలా వ్యత్యాసం ఉన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడడం, ఆన్ లైన్ లో సెర్చింగ్ చేయడం లో గ్రామీణ ప్రాంతాల వారు చాలా వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే.

 New Microsoft Jugalbandi Tool For Rural People , Jugalbandi Tool, New Microsoft,-TeluguStop.com

మరి వీళ్ళకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో సెర్చ్( Search online ) చేయడం కాస్త ఇబ్బంది కరమే.వీరి కోసం సరికొత్తగా మైక్రోసాఫ్ట్ కంపెనీ జుగల్బందీ ( Microsoft Company Jugalbandi )అనే వాట్సప్ టూల్ ను అందుబాటులోకి తెచ్చింది.

దీని పని ఏమిటంటే గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తేలికగా అందించడమే.చాట్ జిపిటి తరహాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ టూల్ పనిచేస్తుంది.

Telugu Jugalbandi Tool, Latest Telugu, Microsoft, Search-Technology Telugu

భారత దేశంలో ఉండే పలు భాషలలో ఈ టూల్ అందుబాటులో ఉండనుంది.యూజర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు వారి భాషలోనే మెరుగైన సమాధానాలను అందిస్తుంది.జుగల్బంది టూల్ ద్వారా వాట్సాప్ నెంబర్ కు టెక్స్ లేదా ఆడియో మెసేజ్ పంపితే చాలు సమాధానం వస్తుంది.యూజర్ ఏ భాషలో ప్రశ్న అడిగిన ముందుగా స్పీచ్ రికగ్నైజేషన్ మోడల్ సాయంతో ప్రతి మెసేజ్ ని ట్రాన్స్లేషన్ మోడ్ లో ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసుకుంటుంది.

ఆ తరువాత యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం సేకరించి యూజర్ ఏ భాషలో ప్రశ్న అడిగాడో అదే భాషలో సమాధానాన్ని మెసేజ్ లేదా వాయిస్ రూపంలో కూడా మార్చి వినిపిస్తుంది.

Telugu Jugalbandi Tool, Latest Telugu, Microsoft, Search-Technology Telugu

అయితే తొలి దశలో భారత దేశంలో ఉండే 22 భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.ఇందులో సుమారు 170 పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ రూపంలో అందిస్తుంది.ఈ టూల్ మంచి రిజల్ట్ ఇస్తుందని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే మిగతా భాషలలో కూడా ఈ టూల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube