న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి 10 గైడ్ లైన్స్ విడుదల చేసిన తెలంగాణ పోలీసులు..!!

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఎవరికివారు న్యూ ఇయర్ వేడుకలు భారీ ఎత్తున జరుపుకోవటానికి రకరకాల ప్లాన్ లు వేసుకుంటున్నారు.

ఈ తరుణంలో హైదరాబాదులో న్యూఇయర్ వేడుకలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే.గైడ్ లైన్స్ పాటించకపోతే న్యూ ఇయర్ రోజే జైల్ కి వెళ్లాల్సి ఉంటుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో భారీ పాయింట్స్ కలిగిన గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది.1) న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి రెండు రోజులకు ముందే పర్మిషన్ ఉండాలని తెలిపారు.2) కరోనా వ్యాక్సిన్ రెండురోజులు తీసుకున్న వారికే అనుమతి అని తెలిపారు.3) అదేవిధంగా సిబ్బందికి రెండు రోజుల ముందే కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.4) సోషల్ డిస్టెన్స్.5) తప్పనిసరిగా మాస్కు ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్.6)డీజే లకి పర్మిషన్ లేదు ఎవరైనా సౌండ్ పొల్యూషన్ విషయంలో కంప్లైంట్ చేస్తే చర్యలు కట్టిన.7) కొత్త సంవత్సరం వేడుకల్లో డ్రగ్స్ కు అనుమతిస్తే చర్యలు తప్పవు.8)నగరవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.మద్యం మత్తులో వాహనం నడిపితే ఆర్నెల్ల జైలుతో పాటు రూ.10 వేల జరిమానా.9)అసభ్యకర రీతిలో దుస్తులు ధరించినా, అశ్లీల నృత్యాలు చేసినా చర్యలు.

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి... కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు

తాజా వార్తలు