వాట్సాప్ గ్రూప్ లో కొత్తగా అదిరిపోయే ఫీచర్..!

ఎంతో ప్రజాదారణ పొందిన మెసేంజర్ యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

ఎప్పటికప్పుడు వాట్సాప్ సరికొత్త ఫీచర్లతోటి యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ గ్రూపులో మరొక కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది.అదే కమ్యూనిటీ ఫీచర్.

ప్రస్తుతం ఈ కమ్యూనిటీ ఫీచర్ పై వాట్సాప్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.ముందుగా XDA డెవలపర్ ఈ ఫీచర్ గుర్తించగా, వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

మరి ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ కు కమ్యూనిటీ ఫీచర్ ద్వారా కొన్ని ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేయనుంది.

Advertisement

ఫలితంగా వాట్సాప్ గ్రూప్‌లపై గ్రూప్ అడ్మిన్లకు మరింత కంట్రోల్ ఇవ్వనుంది.అలాగే వాట్సాప్ కమ్యూనిటీలోని సభ్యులు వేర్వేరు గ్రూప్ లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

తద్వారా ఆయా గ్రూప్ లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సెక్యూరిటీ కూడా అందిస్తుంది.అయితే ఈ కమ్యూనిటీ గ్రూప్ లకు అడ్మిన్ గా ఉండే యూజర్లు తమ కమ్యూనిటీలోని అన్ని గ్రూప్లలోకి కూడా మెసేజ్లు పంపుకోవచ్చు.

అలాగే కొత్తగా వాట్సాప్ కమ్యూనిటీలోకి యాడ్ అయిన వ్యక్తి గ్రూప్ లోని ఇతర సభ్యులతో చాట్ చేసేది లేనిది అనేది పూర్తిగా ఆ కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.అడ్మిన్ డెసిషన్ ప్రకారమే గ్రూప్ లో ఉన్న ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చాట్ చేయడం కుదురుతుంది అన్నమాట.ఈ కమ్యూనిటీ ఫీచర్ ద్వారా తక్కువ డేటాను ఉపయోగించుకుని, సమాచారాన్ని మరింత ఎక్కువ మంది వాట్సాప్ యూజర్లకు చేరవేయడం కుదురుతుంది.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం ఈ కమ్యూనిటీ ఫీచర్ ఐకాన్ అనేది నాలుగు మూలలు చతురస్రాకారంలో ఉండి నాలుగు వైపులా రౌండ్ ఎడ్జ్ కలిగి ఉంటుంది.ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

త్వరలోనే ఈ ఫీచర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు