కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక ఇప్పుడిప్పుడే వరుసగా సినిమాలు మేకర్స్ తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నాయి.
పాండమిక్ తర్వాత బాక్సాఫీస్ కల తప్పింది అనే చెప్పాలి.ఓటిటి లకు ప్రేక్షకులు బాగా అలవాటు పడడంతో వారిని థియేటర్స్ వరకు రప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు.
మరి ఇలాంటి తరుణంలో మన టాలీవుడ్ ఫిలిం మేకర్స్ సరికొత్త కథలను తమ కాలానికి మరింత పదును పెట్టి హీరోలను ఒప్పించి సరికొత్త కాంబో లను సెట్ చేసుకుంటున్నారు.మరి అలాంటి కొత్త కాంబో లు ఏంటో చూద్దాం.
యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు.ఈయన ప్రెజెంట్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో రావడానికి సిద్ధం అవుతున్నాడు.
ఆ తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో చేయనున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
రామ్ పోతినేని కూడా ఇటీవలే ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనుంది.
అలాగే అనిల్ రావిపూడి తో కూడా మరొక సినిమా లైన్లో పెట్టనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా తర్వాత చైతూ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా సినిమా చేస్తున్నాడు.అలాగే పరశురామ్ తో ఒక సినిమా, పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో కూడా చేయబోతున్నాడు అంటూ టాక్ వస్తుంది.
అక్కినేని మరో యంగ్ హీరో అఖిల్ ఏజెంట్ సినిమాతో ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా నిర్మించనున్నాడని.
తమ్ముడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాతో ఇటీవలే అలరించాడు.దీని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా, సుజిత్ తో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా థ్రిల్లర్ జోనల్ లో సుకుమార్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత సంపత్ నంది తో మరో సినిమా లైన్లో పెట్టాడు.
వీటితో పాటు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాలో నటిస్తున్నాడు.ఇలా ఫిలిం మేకర్స్ అంతా కొత్త కాంబో లను తెరమీదకు తెస్తున్నారు.







