లోకంలో కొత్త కొత్త మాయదారి రోగాలు వచ్చినట్లుగా, సోషల్ మీడియా వస్తున్న కొత్త కొత్త ఆటలు జనాన్ని ప్రమాదంలో పడవేస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో కొత్త ఆటకు వేదిక అయ్యిందట టిక్‌టాక్.
ఈ ప్రమాదకరమైన ఛాలెంజ్ గురించి తెలుసుకుంటే.
దీని పేరు ‘ఫుట్ పీలింగ్’ పేరు విచిత్రంగా ఉందని నెత్తిగోక్కుంటున్నారా.
అంతే పిచ్చిపిచ్చి ఆటల పేర్లు ఇలాగే ఉంటాయట.ఇకపోతే ప్రస్తుతం ఫుట్ పీలింగ్ అనే కొత్త ఛాలెంజ్ లో చేయవలసిన పని ఏంటంటే.
తమ కాళ్లకు ఫుట్ పీలింగ్ మాస్కును అంటించుకుని, అరికాళ్ల తోలును పీకేసుకోవడం.
ఇలా చేయడం వల్ల టిక్‌టాక్ లో ఫేమస్ అవడం మాట దేవుడెరుగు.
పని గట్టుకుని ప్రమాదాలను ఆహ్వానించినట్లే.అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్లే.
ఇక ఈ జెల్ గనుక ఎక్కవ సేపు చర్మంపై ఉంచుకుంటే, అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది.జెల్ చర్మానికి గట్టిగా అతుక్కుంటే చర్మం కూడా ఊడి వస్తుంది.
చుశారా జరిగే నష్టాలను.మరి మనకెందుకండి ఈ పిచ్చి ఆటలు అని అనుకుంటున్నారా! అది మీ యిష్టం.