దేశీయ 2-వీలర్ తయారీదారు TVS మోటార్ అనేక దేశాలలో వాహనాలను విక్రయిస్తోంది.ఆ దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి.
బంగ్లాదేశ్‌లో TVS తాజాగా మెట్రో ప్లస్ 110 పేరుతో కొత్త మోటార్‌సైకిల్‌ను అప్‌గ్రేడెడ్ ఫీచర్లు, కొత్త చేర్పులతో విడుదల చేసింది.నిజానికి ఇది పూర్తిగా కొత్త మోటార్‌సైకిల్ కాదు.
దీనిని ఇండియాలో స్టార్ సిటీ ప్లస్‌గా అమ్ముతున్నారు.అయితే టీవీఎస్ మెట్రో ప్లస్ 110cc, టీవీఎస్ స్టార్ సిటీ రెండూ మోటార్‌సైకిళ్లు దాదాపు ఒకేలా ఉంటాయి.

మెట్రో ప్లస్ 110 అప్‌గ్రేడ్‌లలో ఉన్న మెట్రో ప్లస్ రెన్యూడ్ స్టైలింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్లు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను సంతృప్తి పరుస్తాయని కంపెనీ భావిస్తోంది.ఇక ఈ బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, కొత్త డ్యూయల్-టోన్ కలర్స్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ ఆఫర్ చేశారు.వీటన్నింటితో పాటు అన్ని గేర్‌లలో పనిచేసే ఎలక్ట్రిక్ స్టార్ట్ ఫీచర్, రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ దీనిలో హైలెట్‌గా నిలుస్తున్నాయి.

మెట్రో ప్లస్ 110 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 110 cc సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.కంపెనీ బంగ్లాదేశ్‌లో తొలిసారిగా ప్రారంభించినప్పటి నుంచి TVS మెట్రో ప్లస్ 110 బైక్ యూనిట్స్‌ను 1.2 లక్షలకు పైగా విక్రయించింది.ఈ బైక్ 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 8.29 bhp, 5,000 ఆర్‌పీఎమ్ వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఇకపోతే భారతదేశంలో స్టార్ సిటీ ప్లస్ ధరలు రూ.73,500 నుంచి ప్రారంభమైతే.బంగ్లాదేశ్‌లో 2023 టీవీఎస్ మెట్రో ప్లస్ 110సీసీ ధరలు డ్రమ్ బ్రేక్ వేరియంట్ BDT 1.25 లక్షలు (సుమారు రూ.1 లక్ష).డిస్క్ బ్రేక్ వేరియంట్ BDT 1.3 లక్షల (దాదాపు 1.05 లక్షలు) నుంచి ప్రారంభమవుతాయి.







