ట్విట్టర్లో సరికొత్తగా ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్..!

ట్విట్టర్( Twitter ) లో ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.ఈ కాలింగ్ ఫీచర్ కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

 New Audio And Video Calling Feature On Twitter Audio , Twitter , Audio , Twitt-TeluguStop.com

ఎలాన్ మస్క్( Elon Musk ) చేతిలోకి ట్విట్టర్ వెళ్ళాక.ట్విట్టర్లో సరికొత్త ఫీచర్లు వేగవంతంగా అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటికే చాలా ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.మరికొన్ని ఫీచర్లు ప్రయోగ దశలో ఉన్నాయి.ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది.ట్విట్టర్ సీఈవో లిండా యాకరినో( Linda Yaccarino ) ప్రకటన ద్వారా ఈ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు తమ ఫోన్ నెంబర్ ను ఇతరులతో పంచుకోకుండానే వీడియో కాలింగ్ చేయవచ్చని సీఈవో స్పష్టం చేశారు.కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ ట్విట్టర్ ఆప్ లో ప్రత్యక్షం అవుతుందని ఆమె తెలిపారు.

ప్రముఖ టెక్నో అయినా క్రిస్ మెస్సినా ఈ ఆడియో, వీడియోలకు సపోర్ట్ చేసే ఓ కోడ్ ను రివీల్ చేశారు.తనకు ట్విట్టర్ సీఈవో లిండా యాకరినో నుంచి సూచనలు కూడా అందాయని క్రిస్ మెస్సినా స్పష్టం చేశారు.ఈ ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్ కేవలం ప్రీమియం, సబ్ స్క్రిప్షన్- ఓన్లీ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.అందిన సమాచారం ప్రకారం వెరిఫైడ్ ట్విట్టర్ యూజర్లకు మాత్రమే కాలింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండనుంది.

కాల్ స్వీకరించే వ్యక్తి, కచ్చితంగా కాల్ చేసే వారిని ఫాలో అయినప్పుడే ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని సమాచారం.అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో ట్విట్టర్ వెల్లడించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube