ప్రముఖ కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ఒకప్పుడు ఊహించని స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోగా ప్రస్తుతం ఈ షో రేటింగ్స్ అంతకంతకూ తగ్గుతున్నాయి.జబర్దస్త్ షోకు అనసూయ దూరం కావడం కూడా ఈ షో రేటింగ్స్ తగ్గడానికి ఒక కారణమని చాలామంది భావిస్తారు.
అయితే జబర్దస్త్ షోలోకి కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది.టీవీ సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన సౌమ్యా రావు జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
తొలిరోజే తనదైన పంచ్ లతో సౌమ్య అందరికీ షాకిచ్చింది.సౌమ్య ఎంట్రీతో జబర్దస్త్ షో రేటింగ్స్ పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆది సౌమ్యతో మీరు యాంకరా? అని అడగగా మీరు కామెడీ యాక్టర్ కావచ్చని నేను యాంకర్ కాకూడదా అంటూ ప్రశ్నించారు. హైపర్ ఆదికి కరెక్ట్ టైంలో మ్యారేజ్ చేసి ఉంటే మురారి లాంటి అబ్బాయి అక్కడ కూర్చొని జబర్దస్త్ ప్రోగ్రాం చూసేవాడంటూ సౌమ్య పంచ్ లు వేశారు.
హైపర్ ఆది వెంటనే ఇంకేం చేసుకో మురారిని ఇచ్చేద్దాం అని సౌమ్యతో చెబుతాడు.ఆ తర్వాత సౌమ్య రష్మీని ఇమిటేట్ చేయడం గమనార్హం.సౌమ్య ఎంట్రీతో జబర్దస్త్ షోకు కొత్త కళ వచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హైపర్ ఆది కొత్త యాంకర్ పేరేంటో అని అడగగా ఆమె సౌమ్య అని చెప్పింది.
హైపర్ ఆది వెంటనే నువ్వు సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియా అంటూ అదిరిపోయే పంచ్ వేశారు.
రాబోయే రోజుల్లో ఆది సౌమ్య మధ్య లవ్ ట్రాక్ ను జబర్దస్త్ షోలో హైలెట్ చెయ్యనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.సౌమ్య తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినా మంచి కామెడీ టైమింగ్ తో పంచ్ లు వెయ్యడం ఆమెకు ఒక విధంగా ప్లస్ అవుతోంది.సౌమ్య వాయిస్ మరియు టైమింగ్ అద్భుతం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.