రాష్ట్రంలో న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను వైద్య ఆరోగ్యశాఖ ప్రారంభించింది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైద్యులు ఒక చిన్నారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా పీసీవీ డ్రైవ్ కు శ్రీకారం చుట్టారు.
అనంతరం మంత్రుల సమక్షంలో జిల్లాస్థాయిలో వ్యాక్సిన్ ప్రారంభించారు.న్యుమోనియా వ్యాధితో రెండేళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా మృతి చెందటాన్ని నివారించేందుకు న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా.ఇది మూడు డోసుల వ్యాక్సిన్.
ఆరు వారాలు నిండిన 5,45,506 మంది చిన్నారులకు ఈ ఏడాది న్యుమోనియా తొలి డోసు ఇవ్వనున్నారు.తర్వాత 14 వారాలు నిండిన 4,09,130 మంది చిన్నారికి రెండు డోసు.
తొమ్మిది నెలల నిండిన 68,188 మంది చిన్నారులకు బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.