టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వెండితెర, బుల్లితెర నటి హరితేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈమె నటిగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.
ఇక అప్పుడప్పుడు ఈమె వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ముఖ్యంగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్టుల పట్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.
అయినా కూడా వాటిని పట్టించుకోదు హరితేజ.ఇక తాజాగా ఆమె మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంది.
ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
హరితేజ సినీ ఇండస్ట్రీలో తొలిసారిగా యాంకర్ గా అడుగు పెట్టింది.
తన మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంది.ఇక అక్కడి నుంచి ఈమె యాక్టర్ గా మారింది.
ఇక ఈమె డాన్సర్ కూడా.ఇక ఈమె తొలిసారిగా 2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది.
తొలి నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హరితేజ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ సైడ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా నటించింది.
మనసు మమత సీరియల్ తో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
అంతేకాకుండా పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే 2015 లో దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.వీరికి ఒక కూతురు కూడా ఉంది.ఇక హరితేజ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
బిగ్బాస్ ముందు సోషల్ మీడియాలో అంత కనిపించలేదు కానీ ఆ షో తర్వాత మాత్రం బాగా యాక్టివ్ గా మారింది.ఇక ఈమె తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.
తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే అప్పుడప్పుడు ఈమె షేర్ చేసుకునే పోస్టులని చూస్తే నెటిజన్స్ బాగా మండిపడతారు.
ముఖ్యంగా ఈమె వేషధారణను చూసి నెగిటివ్ కామెంట్లు చేస్తారు.పెళ్లయి పాప ఉన్నప్పటికీ కూడా ఈమె గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.
ఈమెను చాలా సార్లు ట్రోల్స్ చేశారు.పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.
అయినా కూడా ఆమె అలాగే రెచ్చిపోతూ ఉంటుంది.
తాజాగా తను ఒక డాన్స్ ప్రోగ్రాం సందర్భంగా పీకాక్ గెట్ అప్ లా రెడీ అయ్యి ఫోటో షేర్ చేసుకుంది.
ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ తనపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా అవతార్ 3 తీస్తున్నావా అంటూ తనకు తెలిసిన వ్యక్తి కామెంట్ పెట్టగా ఆ కామెంట్ కు తాను మంచి కాంప్లిమెంట్ ఇచ్చావు అంటూ తిరిగి కౌంటర్ వేసింది.
ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.