తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున యూట్యూబర్స్ అలాగే సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలను భారీ స్థాయిలో తమ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకున్నటువంటి బారాస పార్టీ ఓడిపోయిన తర్వాత ఒకసారిగా యూట్యూబర్స్ అందరూ కూడా ప్రమోషన్ వీడియోలన్నింటిని సోషల్ మీడియా వేదికగా డిలీట్ చేస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము.ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అధికంగా ఉంటే వారి చేత బిఆర్ఎస్ పార్టీ( BRS Party ) పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే కొందరు విమర్శలను కూడా ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వారిలో గంగవ్వ ( Gangavva ) కూడా ఒకరు.
ఈమె తన గ్రామంలో గ్రామీణ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందనే విషయాలన్నింటినీ కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోల రూపంలో తెలియజేశారు.ఇలా ఎన్నో వీడియోలను చేస్తూ గంగవ్వ ఎంతో ఫేమస్ అయ్యారు.
ఇక ఈమె ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని అనుభవిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక గంగవ్వ యూట్యూబ్ ఛానల్ కు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు రావడం చేత ఏదైనా ఒక సినిమా విడుదలవుతుంది అంటే సెలబ్రిటీలు గంగవ్వతో ముచ్చట్లు పెడుతూ తమ సినిమాని ప్రమోట్ చేసేవారు.ఇలా ప్రమోషన్ కార్యక్రమాలతో కూడా గంగవ్వ ఎంతో బిజీగా ఉండేవారు.ఇకపోతే ఎన్నికల సమయంలో బారాస నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) సైతం గంగవ్వతో పచ్చని పొలాలలో నాటుకోడి బిర్యానీ వండుతూ ముచ్చట్లు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా కేటీఆర్ ( KTR )తో ముచ్చట్లు పెడుతూ ఎన్నికల ప్రచారాలను నిర్వహించినటువంటి గంగవ్వ ఇప్పుడు అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.అయితే తెలంగాణ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గెలుపొందడంతో గంగవ్వ రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రేవంత్ రెడ్డి కోసం గంగవ్వ ప్రత్యేకంగా మిర్చి బజ్జి తీసుకువచ్చి ఆయనతో ముచ్చట్లు పెడుతూ సరదాగా మాట్లాడారు.ఇలా రేవంత్ రెడ్డితో గంగవ్వ ముచ్చట్లు పెట్టినటువంటి ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై పలువురు భారీ స్థాయిలో గంగవ్వను ట్రోల్ చేస్తున్నారు.

ఎన్నికలకు ముందు కేటీఆర్ తో పెద్ద ఎత్తున ముచ్చట్లు పెడుతూ తమ పార్టీని ప్రమోట్ చేసినటువంటి గంగవ్వ ఇప్పుడు బారాస ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈమె రేవంత్ రెడ్డి( Revanth Reddy )ని కలవడంతో పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ నువ్వు కూడా పార్టీలు మారుస్తావా గంగవ్వ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొన్నటి వరకు కేటీఆర్ తో ముచ్చట్లు పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిశారు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఈ వీడియో చూస్తే కెసిఆర్ కు ఎక్కడో కాలుతుంది అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్లు చేయడం గమనార్హం.







