యూట్యూబ్ వీడియోల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఈరోజు ఊహించని విధంగా ఒక కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులకు నీతులు చెప్పే షణ్ముఖ్ జశ్వంత్( Shanmukh Jaswanth ) నిజ జీవితంలో మాత్రం చెత్త పనులు చేస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
షణ్ముఖ్ జశ్వంత్ వివాదాలలో చిక్కుకోవడం తొలిసారి కాదు.
బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లో ఉన్న సమయంలో ఒక కంటెస్టెంట్ తో క్లోజ్ గా మెలగడం ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ తన లవర్ ను దూరం చేసుకోవాల్సి వచ్చింది.
తర్వాత రోజుల్లో ర్యాష్ డ్రైవింగ్ ద్వారా షణ్ముఖ్ వార్తల్లో నిలిచారు.ఇలా తప్పు మీద తప్పు చేస్తున్న షణ్ముఖ్ యూట్యూబ్ వీడియోలలో( YouTube videos ) మాత్రం తాను ఎంతోమందికి రోల్ మోడల్ అనేలా కనిపిస్తున్నారు.
షణ్ముఖ్ సొంత యూట్యూబ్ ఛానల్ కు రికార్డ్ స్థాయిలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా షణ్ముఖ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఒకప్పుడు కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్నా ఒదిగి ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.ఇతని సోదరుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఇంటికి వెళ్లిన పోలీసులకు ఊహించని విధంగా షణ్ముఖ్ చిక్కాడు.
తను చేస్తున్న పనుల వల్ల షణ్ముఖ్ జశ్వంత్ అభిమానించే అభిమానులను సైతం దూరం చేసుకుంటున్నారు.కొన్నిరోజుల క్రితం యూట్యూబర్ ( YouTuber )చందూసాయిపై ఫిర్యాదు నమోదు కాగా ఆ ఘటన మరవక ముందే షణ్ముఖ్ జశ్వంత్ వివాదంలో చిక్కుకున్నారు.షణ్ముఖ్ ఈ వివాదం నుంచి బయటపడతారో లేదో చూడాలి.