చరణ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అవార్డులను అవమానించడంతో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram charan ) మరికొన్ని రోజుల్లో పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.నాటు నాటు సాంగ్ కు( Naatu Naatu Song ) అవార్డ్ రావడంతో చరణ్ పేరు మారుమ్రోగుతోంది.

 Netizens Trolling Ram Charan Details, Ram Charan, Ram Charan Trolled, Oscar Awar-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ డ్యాన్సర్లలో రామ్ చరణ్ ఒకరనే సంగతి తెలిసిందే.అయితే రామ్ చరణ్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఒక ఫోటోలో నంది అవార్డులను( Nandi awards ) నేలపై పెట్టి ఆస్కార్ అవార్డులను( Oscar awards ) టేబుల్ పై పెట్టి చరణ్ ఫోటోలను షేర్ చేశారు.

ఫోటోలో చరణ్ స్టైల్ గా టేబుల్ పై కూర్చొని ఉన్నారు.

టేబుల్ పైన ఆస్కార్ అవార్డ్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఉండగా ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు మాత్రం నేలపై చరణ్ కాళ్లకు దగ్గరగా ఉన్నాయి.నంది అవార్డుల విషయంలో చరణ్ చిన్నచూపుతో వ్యవహరించారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

చరణ్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీ అవుతున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సినిమా షూట్ పూర్తి కానుందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయని సమాచారం అందుతోంది.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానున్నా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు పాన్ వరల్డ్ లెవెల్ లో తన సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.చరణ్ కు మాస్ ప్రేక్షకుల్లో అంచనాలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.చరణ్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube