Bhola Shankar : భోళా శంకర్ పోస్టర్ పై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్.. అలా ఉందంటూ?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ), మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannaah ) ప్రధాన పాత్రల్లో కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరంజీవి చెల్లెలి రోల్ లో నటిస్తున్న భోళా శంకర్ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.వేదాళం రీమేక్ గా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 Netizens Trolling Bhola Shankar Poster Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఈ ఏడాది ఆగష్టు నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

అయితే ఈ సినిమా పోస్టర్ ను చూసిన నెటిజన్లు షాపింగ్ మాల్ యాడ్ లా ఉందని దారుణంగా ట్రోల్స్, కామెంట్లు చేస్తున్నారు.

మెహర్ రమేష్ పోస్టర్ల విషయంలో కేర్ తీసుకోవాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.షాడో తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమా సక్సెస్ సాధించడం తమన్నాకు కూడా కీలకమనే సంగతి తెలిసిందే.తెలుగులో తమన్నాకు కొత్త సినిమా ఆఫర్లు రావాలంటే ఈ సినిమా సక్సెస్ సాధించాల్సిందేనని చెప్పవచ్చు.వరుస విజయాలతో జోరుమీదున్న చిరంజీవి ఈ మూవీతో కూడా సక్సెస్ ను అందుకుని హ్యాట్రిక్ ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేసి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మహతి స్వరసాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మహతి స్వరసాగర్ కూడా స్టార్ స్టేటస్ ను అందుకునే ఛాన్స్ ఉంది.భోళా శంకర్ సినిమాపై చాలామంది కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube